బాన్సువాడ రూరల్ : వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదును దృష్టిలో పెట్టుకొని మొక్కలు ( Plant )ఎండిపోకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎంపీవో సత్యనారాయణ రెడ్డి ( MPO Satyanarayana Reddy ) గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్‌కు సూచించారు. బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్ గ్రామంలో బుధవారం ఆయన పర్యటించారు.
గ్రామంలో పల్లె ప్రకృతి వనం ( nature forest) , నర్సరీ, వైకుంఠధామం, కంపోస్టు షెడ్డును పరిశీలించారు. గ్రామంలో కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని సూచించారు. పల్లె ప్రకృతి వనం, నర్సరీలలో మొక్కలు ఎండిపోకుండా ఉపాధి హామీ సిబ్బందిచే ప్రతిరోజు నీళ్లు పట్టించాలని అన్నారు. గ్రామంలో ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు.
పని అడిగిన ప్రతికూలికి పని కల్పించాలని, జాబ్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి వంద రోజులు పని కల్పించాలని వెల్లడించారు. మార్చి నెలాఖరు నాటికి వంద రోజులు పూర్తి అయ్యేలా పనులు కల్పించాలని క్షేత్ర సహాయకుడు రాముకు సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, మురికి కాలువలో నీరు నిలవకుండా శుభ్రం చేయించాలని ఆదేశించారు.