ప్రశాంతంగా గ్రూప్-1 ప్రిలిమ్స్
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లో 77.49 శాతం, కామారెడ్డిలో 78.99 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
- నిజామాబాద్‌లో 77.49, కామారెడ్డిలో 78.99 శాతం హాజరు
- పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్లు, అధికారులు
- కామారెడ్డిలో ఆలస్యంగా వచ్చిన ఇద్దరు అభ్యర్థులకు నో ఎంట్రీ
కంఠేశ్వర్/ కామారెడ్డి, జూన్ 9: ఉమ్మడి జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో 41, కామారెడ్డి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. నిజామాబాద్‌లో 77.49 శాతం, కామారెడ్డిలో 78.99 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 12,833 మంది అభ్యర్థులకు 9,945 మంది పరీక్షకు హాజరుకాగా 2,888 మంది గైర్హాజరైనట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో 4,797 మంది అభ్యర్థులకు 3,780 మంది హాజరుకాగా 1017 మంది గైర్హాజరైనట్లు కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, సమన్వయకర్త డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు.
కామారెడ్డిలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, ఎస్పీ సింధూశర్మ, నిజామాబాద్ నగరశివారు మానిక్‌బండార్ సమీపంలో ఉన్న కిట్స్, ఎస్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తనిఖీ చేశారు. అభ్యర్థులకు ఉపయుక్తంగా ఉండేలా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. దీంతోపాటు పరీక్షా కేంద్రాల వద్ద సమగ్ర వివరాలు, అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలను క్షుణ్ణంగా తెలియజేస్తూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలస్యంగా వచ్చిన ఇద్దరికి నోపర్మిషన్ కామారెడ్డి డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రానికి ఇద్దరు అభ్యర్థులు ఆలస్యంగా రాగా.. అధికారులు అనుమతించలేదు. దీంతోవారు పరీక్ష రాయకుండానే వెనుదిరిగారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

