బోధన్, నవంబర్ 24 : శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదివారం నాటికి మూడేండ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో బీఆర్ఎస్ బోధన్ పట్టణ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను తెలంగాణ భవన్లో వారు మర్యాదపూర్వకంగా కలిశారు. బోధన్ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి విషయమై ఆయనతో చర్చించారు.