మోర్తాడ్, డిసెంబర్ 7: కమ్మర్పల్లి మండలం హాసాకొత్తూర్, ఇనాయత్‌నగర్ గ్రామాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు శనివారం పంపిణీ చేశారు. ఇనాయత్‌నగర్‌లో ఇద్దరికి మాజీసర్పంచ్ గంగాధర్ అందజేశారు.
హాసాకొత్తూర్‌లో అదే గ్రామానికి చెందిన లక్ష్మికి రూ.11వేలు, సుప్రియకు రూ.16,500, ధర్మయ్యకు రూ.10,500, గణేశ్‌కు రూ.19వేలు, కమలకు రూ.18వేలు, నందితకు రూ.6వేలు, ప్రీతికి రూ.6500, రాజుకు రూ.8500, రాజన్నకు రూ.11500, ముత్తెమ్మకు రూ.14500, వనితకు రూ.9500, శోభకు రూ.10వేలు, ప్రభాకర్‌కు రూ.30వేలు, గంగారాంకు రూ.13500 సీఎంఆర్ఎఫ్ చెక్కులను బీఆర్ఎస్ నాయకులు పంపిణీచేశారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు తెడ్డు కిరీటి, మాజీ ఉపసర్పంచ్ ఏనుగు రాజేశ్వర్, నోముల నరేందర్, గడ్డం శ్రీధర్, కోటగిరి వెంకటేశ్, కట్ట చిరంజీవి, గడ్డం భూమన్న, బంగ్లా ప్రవీణ్, జంగం మహేశ్ తదితరులు పాల్గొన్నారు.