ఆర్మూర్, అక్టోబర్30: అభివృద్ధిని చూసి ఆదరించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి కోరారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా సోమవారం ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్, కోమన్‌పల్లి గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ద్విచక్ర వాహన శ్రేణితో ఫత్తేపూర్ చేరుకున్న జీవన్‌రెడ్డికి యువకులు, గ్రామస్తులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. జీవన్‌రెడ్డి గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో పేదలకు వరమని, దీనిని ఓటర్లకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రూ.3వేల కోట్లతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామన్నారు. ఆర్మూర్‌లో 17 వివిధ కులాల సంఘాలకు ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. ఇంటింటికీ మిషన్ భగీరథ తాగు నీటిని అందిస్తున్నామని, రూ.120కోట్లతో ఫత్తేపూర్- చేపూర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాధించామన్నారు. అభివృద్ధి ఇంకా ముందుకు సాగాలంటే తనను మళ్లీ గెలిపించాలని జీవన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ రాష్ట్ర చైర్మన్ మార గంగారెడ్డి, ఫత్తేపూర్ సర్పంచ్ కొత్తపల్లి లక్ష్మి, ఎంపీటీసీ హన్మాండ్లు, బీఆర్ఎస్ నాయకుడు వజ్రంరెడ్డి, కోమన్‌పల్లి సర్పంచ్ నీరడి రాజేశ్వర్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బోధన్ రూరల్, అక్టోబర్ 30: వచ్చే నెల 30న జరగనున్న అంసెబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పని చేయాలని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సతీమణి ఆయేషా ఫాతిమా పిలుపు నిచ్చారు. బోధన్ మండలంలోని ఊట్పల్లి, అమ్దాపూర్, బెల్లాల్ గ్రామాల్లో ఆమె గడగడపకు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కార్యక్రమాన్ని పరిశీలించారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్‌ను ముడోసారి భారీ మెజార్టీతో గెలపించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణగుప్తా, పార్టీ మండల కార్యదర్శి సిర్ప సుదర్శన్, వినోద్‌నాయక్, బలరాం, ఆస్రర్, నాయకులు పాల్గొన్నారు.
ఎడపల్లి, అక్టోబర్ 30: మండలంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మండలంలోని వివిధ గ్రామాల్లో ఇంటింటికీ తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించారు. మండల కేంద్రంలో ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్యేగా షకీల్ ఆమేర్‌ను గెలిపించాలని కోరారు. జంలంలో ఎంపీపీ కొండెంగల శ్రీనివాస్, కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.
నందిపేట్, అక్టోబర్ 30 : మండల కేంద్రంతో పాటు బజార్ కొత్తూర్ గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మచ్చర్ల సాగర్, ఉపసర్పంచులు కొత్తూర్ భరత్, ముత్యం, నాయకులు మహేందర్, భజరంగ్ పాల్గొన్నారు.
ఖలీల్‌వాడి, అక్టోబర్ 30: నగరంలోని అన్ని డివిజన్లలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జిలు సోమవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, నగరంలో గణేశ్‌గుప్తా చేపట్టిన అభివృద్ధి పనులను ఓటర్లకు వివరించారు. బీఆర్ఎస్కు ఓటు వేసి అర్భన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్‌గుప్తాను గెలిపించాలని కోరారు.