ఊరూరా గులాబీ జెండా రెపరెపలాడింది. జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జెండాలను గ్రామ, మండల శాఖల అధ్యక్షులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఆవిష్కరించారు. మిఠాయిలు తినిపించుకొని సంబురాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, సొసైటీల పాలకవర్గ సభ్యులు, రైతుబంధు సమితి కన్వీనర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రతినిధుల సభకు బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఏప్రిల్ 25