ఎడపల్లి : యూరియా యాప్ రద్దు చేయాలని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలోని షాటాపూర్ గేటు వద్ద బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారిపై మండల బీఆర్ఎస్ శ్రేణులు గురువారం రాస్తారోకో నిర్వహించారు. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ యూరియా యాప్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఒక ఎకరానికి రెండు యూరియా బస్తాలు సరిపోవని, కనీసం నాలుగు బస్తాలు అందించాలని డిమాండ్ చేశారు. రైతులకు సకాలంలో యూరియా, ఎరువులు అందించడంతో పాటు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. రైతుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నాతో ప్రధాన రహదారిపై అరగంట పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ కార్యక్రమంలో రైతులు నాయకులు మాజీ ఎంపీపీ శ్రీనివాస్ మాజీ ఉపసర్పంచ్ ఆకుల శ్రీనివాస్ నాయకులు ఉండి నాగేందర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు