Financially strengthened | పోతంగల్, సెప్టెంబర్ 7: బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ ప్రతిష్టతకు పనిచేస్తూనే సొంతగా వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా బలోపేతం కావాలని బాన్సువాడ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు జుబేర్ అన్నారు. పోతంగల్ మండలంలోని జల్లపల్లి ఫారం లో బీఆర్ఎస్ కార్యకర్త నూతనంగా ప్రారంభించిన పాత ఇనుప సమాన్ దుకాణ సముదాయాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఎమ్మార్పీఎస్ నాయకుడు పోచిరం గాయపడ్డ విషయం తెలుసుకుని పోతంగల్ మండలంలోని సోంపూర్ గ్రామం పోచీరాం నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోరే కిషన్, ఎంఏ హకీం, ఫారుక్, సమీర్, ఆరిఫ్, ఎజాస్, సుల్తాన్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.