బాన్సువాడ : బాన్సువాడ ( Banswada ) నియోజకవర్గంలోని బీర్కూరు మండలం తిమ్మాపూర్ శివారులో తెలంగాణ తిరుమల దేవస్థానం లో బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయం మండపంలో నిర్వహించే కార్యక్రమాల్లో పూజ, యజ్ఞంలో తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి ( Pocharam Srinivas Reddy ) , పుష్ప దంపతులు పాల్గొన్నారు.
గురువారం గణపతి పూజ, ప్రత్యేక యజ్ఞ కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం కుటుంబ సభ్యులు సోదరుడు పోచారం శంభురెడ్డి,ప్రేమల , కుమారుడు పోచారం సురేందర్ రెడ్డి గ్రామస్తులు, భక్తులు, ప్రజాప్రతినిధులు, బ్రహ్మోత్సవంలో పాల్గొన్నారు.