బోధన్/ఆర్మూర్, ఫిబ్రవరి 28: బోధన్ ఆర్డీవో బురుగు రాజాగౌడ్, ఆర్మూర్ ఆర్డీవో టి.వినోద్‌కుమార్ బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్‌మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
బోధన్ ఆర్డీవో రాజాగౌడ్‌ను ఆర్మూర్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా, ఆర్మూర్ ఆర్డీ వో వినోద్‌కుమార్‌ను భూపాలపల్లి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా బదిలీచేశారు. మంచిర్యాల డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న సిద్ధం దత్తు బదిలీపై బోధన్ ఆర్డీవోగా వస్తున్నారు.