Cell phone | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని రోడ్డుపై గురువారం సుమారు రూ.లక్ష విలువైన ఐఫోన్ మున్సిపల్ జవాన్‌కు దొరికింది. కాగా ఆ జవాన్ ఆ ఫోన్‌ను యజమానికి అప్పగించి తన నిజాయితీని చాటాడు. బోధన్ మున్సిపాలిటీలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్న గాబ్రియల్ గురువారం విధుల్లో భాగంగా రోడ్డుపై వెళ్తుండగా ఫోన్ కనిపించింది. దీన్ని తీసుకున్న గాబ్రియల్ కొంతసేపు అక్కడే వేచి చూశాడు.
కొంతసేపు వెయిట్ చేసినా ఎవరూ రాకపోవడంతో ఫోన్‌ను తీసుకొని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు ఫోన్ అందజేశాడు. దీంతో పోలీసులు సదరు ఫోన్ యజమాని స్నేహిత్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అతడికి అప్పగించారు. తనకు దొరికిన ఫోన్‌ను అప్పగించినందుకు బోధన్ పట్టణ సీఐ వెంకటనారాయణతో పాటు పలువురవు మున్సిపల్ జవాన్ గాబ్రియల్‌ను పలువురు అభినందించారు.