ఖలీల్‌వాడి, డిసెంబర్ 12 : దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ కాంగ్రెస్ అని, యూపీఏ హయాంలో ప్రతిరోజూ కుంభకోణాలు వెలుగుచూసేవని, రూ.12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్‌కు చెంది రాజ్యసభ ఎంపీ ధీరజ్సాహూ వద్ద అక్రమంగా దాచిన గుట్టలకొద్ది నోట్లకట్టలపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. సాహూపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, కార్పొరేటర్ న్యాలం రాజు ఆధ్వర్యంలో నగరంలోనిధర్నా చౌక్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు మంగళవారం నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ.. ధీరజ్సాహూ వద్ద దొరికిన రూ. 350 కోట్ల నగదు ఎవరిదో రాహుల్‌గాంధీ చెప్పాలన్నారు. దీనిపై ఇండియా కూటమి కూడా మౌనం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధీరజ్ సాహూ డబ్బులతోనే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర పేరిట దొంగ యాత్ర చేపట్టారని ఆరోపించారు. కార్యక్రమంలో నారాయణయాదవ్, రాజశేఖర్‌రెడ్డి, శివప్రసాద్, రవి, కిశోర్ కుమార్, సందీప్, బుస్సాపూర్ శంకర్, మాస్టర్ శంకర్, గడ్డం రాజు, పుట్ట వీరేందర్, చిరంజీవి, సాయిపవర్, శ్రీధర్ పాల్గొన్నారు.