నస్రుల్లాబాద్ : బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో బుధవారం బ్రహ్మోత్సవాలు ( Brahmotsavam) కొనసాగాయి. కార్యక్రమంలో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ( Pocharam Srinivas reddy) కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
శ్రీశ్రీశ్రీ దేవానాత రామానుజ జీయర్ స్వామితో తీర్థ గోష్టి, శ్రీ విశ్వక్సేన ఆరాధన, పుణ్య హవచనం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట చతుస్థానార్చనం, ధ్వజారోహణం, బలిహరణం , పూర్ణాహుతిని వైభవంగా నిర్వహించారు. అనంతరం రామానుజ జీయర్ చే ప్రవచనాలు కొనసాగాయి. మాడ వీధుల్లో పెద్ద శేష వాహనం పై స్వామివారిని ఊరేగించారు. కార్యక్రమంలో నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, విజయ ప్రకాష్, శశికాంత్, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.