ఊరూవాడా ఉయ్యాల పాటలు మార్మోగాయి. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే బతుకమ్మ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. మహిళలంతా తీరొక్క పూలతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చారు. బతుకమ్మల చుట్టూ మహిళలు ఆడిపాడారు.
మహిళలు, యువతులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. బతుకమ్మ, కోలాటం ఆడుతూ సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం మహిళలు గంగమ్మ ఒడికి బతుకమ్మలను చేర్చారు. మహిళలు ఒకరికొకరు వాయినాలు ఇచ్చి పుచ్చుకొని వెంట తెచ్చుకున్న సద్దులను ఆరగించారు.