బాన్సువాడ, సెప్టెంబర్ 22 : బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బాన్సువాడలో ఈ నెల 25న బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నామని, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్ పిలుపునిచ్చారు. బాన్సువాడ పట్టణంలోని నార్ల రత్నకుమార్ నివాసంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు.
బతుకమ్మ సంబురాల ఏర్పాట్లపై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో బతుకమ్మ సంబురాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి కామారెడ్డి జిల్లా మాజీ కన్వీనర్ డాక్టర్ అంజిరెడ్డి, నార్ల రత్నకుమార్, బీఆర్ఎస్ నాయకులు షేక్ జుబేర్, చాకలి సాయిలు, మోచి గణేశ్, గాండ్ల కృష్ణ, మహేశ్, బోడ రాంచందర్, ఇషాక్, శ్రీనివాస్ గౌడ్, మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.