Portugal | పోతంగల్: బదిలీపై వెళుతున్న బ్యాంక్ మేనేజర్ కు ఖాతాదారులు సన్మానించారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలి గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు లో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న నరేష్ ఆర్మూర్ కి బదిలీ అయ్యారు. ఈ సంధర్బంగా అయనకు శనివారం ఖాతాదారులు ఘనంగా సన్మానించారు. ఆయన బ్యాంకులో అందరితో మమేకమై విశేష సేవలందించారనీ అన్నారు.
విధి నిర్వహణలో సమర్థంగా పనిచేసి ఖాతాదారుల మన్ననలు పొందారని, ఆయన మునుముందు పై స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానికులు రాంబాబు, శివరాజ్ పటేల్, రవీందర్, సాయిలు, అర్జున్, రమేష్ పటేల్, యాదరావ్ పటేల్, మారుతి,బ్యాంక్ సిబ్బంది తదితరులు ఉన్నారు.