Nijamabad | కోటగిరి, జూలై 12 : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం యాద్ గార్ పూర్ శివారు లో శనివారం ఒక జింక పిల్ల లభ్యమైందని స్థానిక మాజీ ఉప సర్పంచ్ ఆంజనేయులు, బోధన్ ఆనంద్ తెలిపారు. వారి కథనం ప్రకారం.. యాద్ గార్ పూర్ శివారు లో ఒక చెట్టు కింద జింక పిల్ల కుక్కల భయంతో కూర్చుని ఉంది.
గమనించిన ఆంజనేయులు జింక పిల్ల ను పట్టుకొని స్థానికుల సాయం తో కోటగిరి వెటర్నరీ దావఖానకు తీసుకురాగా డాక్టర్ సురేష్ కుమార్ వైద్యం చేశారు. అనంతరం వర్ని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా కోటగిరి అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ సురేష్ వచ్చారు. ఆ జింక పిల్లను అతడికి అప్పగించారు. ఈ కార్యక్రమం లో సాయికుమార్, అశోక్, పశు వైద్య సహాయకులు సుదీర్ తదితరులు ఉన్నారు.