పెద్ద కొడప్గల్ (పిట్లం) : హత్య కేసు విషయంలో రాజీ కాలేదని కన్నతల్లిని (Mother) కొడుకు చంపిన ఘటన పిట్లం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై రాజు ( SI Raju ) తెలిపిన వివరాలు ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన సబీరా బేగం (60) కు నలుగురు కొడుకులు. 2021 లో ఆమె రెండవ కొడుకు షాదుల్ను మూడవ కొడుకు ముజీబ్ మధ్య ఆస్తి ( Assets ) విషయంలో గొడవపడి ముజీబ్ను షాదుల్ కత్తితో పోడిచి చంపేశాడు. ఈ మర్డర్ కేసు ప్రస్తుతం కోర్టులో ట్రయల్ నడుస్తుంది.
నిందితుడు షాదుల్ తల్లి సబేరా బేగంను కేసుకు రాజీ కమ్మని కోరగా తల్లి అంగీకరించలేదు. దీంతో ఈనెల 24న షాదుల్ తల్లితో గొడవపడి ఆమె తలపై రోకలి దుండుతో బాదాడు. ఆమెకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఎస్సై వివరించారు. మృతురాలి పెద్ద కొడుకు అబ్దుల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.