పెద్ద కొడప్గల్ : కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆదివారం 5వతరగతి గురుకుల ప్రవేశ పరీక్ష (Gurukul Entrance Test) నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ సునీత (Principal Sunitha) తెలిపారు. పరీక్ష కేంద్రంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. విద్యార్థుల హాల్ టికెట్ పై తక్కడపల్లి అని ఉంటుందని, విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. పెద్ద కొడప్గల్ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పరీక్ష కేంద్రం ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు దీనిని గమనించాలని కోరారు. పరీక్ష సమయం కంటే ఒక గంట ముందే హాల్ టికెట్ తీసుకొని పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు.