ఆర్మూర్, జూన్ 12 : తెలంగాణ రాష్ట్రంలో దివ్యాంగులకు స్వర్ణ యుగమని ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌రెడ్డి అభివర్ణించారు. తెలంగాణలో దివ్యాంగులకు పింఛన్ రూ.3,016 నుం చి రూ.4116 పెంచిన సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని దివ్యాంగులతో పట్టణంలోని క్షత్రి య ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. బ్రహ్మ రాసిన నుదిటిరాతనే తిరగరాసిన అభినవ బ్రహ్మ కేసీఆర్ అన్నారు. అంగవైకల్యం ఒక లోపం మాత్రమేనని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే శాపం కాదన్నారు.
దివ్యాంగులకు పింఛన్ పెంచిన కేసీఆర్‌ది చల్లని మనసన్నారు. దివ్యాంగులకు దేశం లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5లక్షల 40వేల మంది దివ్యాంగులకు నెలకు 3,016 చొప్పున నెలకు రూ.108 కోట్లు ఏడాదికి రూ.1800 కోట్లను ప్రభుత్వం ఇస్తున్నదన్నారు. దివ్యాంగులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో 5 శాతం రిజర్వేషన్, విద్యా ఉపాధి పథకాల్లో 5 శాతం రిజర్వేషన్, ఉద్యోల నియమాకాల్లో 4 శాతం ఇస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీ ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ అవయవాలు మొత్తం 14 రకాల వస్తువులను దివ్యాంగులకు అందిస్తున్నట్లు వివరించారు. దేశ ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ వెయ్యి రూపాయలేనన్నారు. మధ్యప్రదేశ్‌లో రూ.300, మహారాష్ట్రలో రూ 300, ఉత్తరాఖండ్‌లో రూ.వెయ్యి, ఉత్తరప్రదేశ్‌లో రూ.వెయ్యి, మణిపూర్‌లో రూ.1500, త్రిపుర, పశ్చిమ
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలని, చదువురాని సన్నాసులని ఆయన విమర్శించారు. అంతకుముందు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం దివ్యాంగులకు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే స్వయంగా వడ్డిస్తూ దివ్యాంగులకు భోజనం తినిపించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్ ఎంపీపీ మున్నా, నందిపేట, ఆర్మూర్ జడ్పీటీసీలు యమునా ముత్యం, మెట్టు సంతోష్, ఆర్మూర్, మాక్లూర్, నందిపేట్ ఎంపీపీలు పస్క నర్సయ్య, మాస్త ప్రభాకర్, వాకిడి సంతోష్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పూజ నరేందర్, సీనియర్ నాయకులు పండిత్ ప్రేమ్, పండిత్ పవన్, ఎస్ఆర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.