Nizamabad | పోతంగల్ ఆగస్టు 1: అన్నా భావు సాటే సేవలు చిరస్మరణీయమని పోతంగల్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు యాదవ రావు అన్నారు. అన్న భావు సాటే 105వ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద భావు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు యాదవ రావు మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకోసం పోరాడిన గొప్ప వ్యక్తి అన్నా భావు సాటే అని కొనియాడారు. సమాజం కోసం ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జయరాం, నక్కే వారి సాయిలు, లింగం, నరసింహులు, హరి, బాలు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.