కోటగిరి : సండే స్మార్ట్ ఫోన్(Smartphone )వద్దు.. వాలీబాల్ క్రీడలే ముద్దు అని కోటగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి అన్నారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని బ్రాహ్మణగల్లిలో నవ యువకులు అందరూ కలిసి వాలీబాల్ గ్రౌండ్ తయారు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కోటగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అనిల్ కులకర్ణి వాలీబాల్ పోటీలను ప్రారంభించారు.
ఈ అనంతరం అనిల్ కుల కర్ణి మాట్లాడుతూ యువకులకు ఇలాంటి మంచి ఆలోచన రావడం అభినందనీయమన్నారు. యువకులు పాఠశాల, కళాశాలకు సెలవులు రాగానే స్మార్ట్ ఫోన్ బదులు క్రీడలను అలవాటు చేసుకోవాలన్నారు. క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుందన్నారు. క్రీడలు ఆడే యువకులకు తనవంతు సహాయ సహకారం ఎల్లప్పుడు ఉంటుందన్నారు.