శక్కర్‌నగర్, జూలై 19: బోధన్ పట్టణం రైల్వేగేట్ ప్రాంతంలోని ఉర్దూఘర్ ఆవరణలో అక్రమంగా నిర్మించిన ఓ భవనాన్ని శనివారం కూల్చివేశారు. ఉర్దూఘర్ ఆవరణలో అక్రమంగా నిర్మా ణం చేపట్టారని ఉర్దూఘ ర్ కమిటీ ప్రతినిధులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేత కార్యక్రమం చేపట్టారు.
ఈ మడిగెలో నిర్వహిస్తున్న హార్డ్‌వేర్ షాప్ యజమానికి ఖాళీ చేయాలని సూచించి, విద్యు త్ సరఫరాను తొలగించారు. అనంతరం సిమెంట్, ఇతర సామగ్రి ఖాళీ చేయించి, మడిగెను జేసీబీ సాయం తో కూల్చివేశారు. కూల్చివేత పనులను బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీఐ వెంకట నారాయణతో పాటు మున్సిపల్ అధికారులు పర్యవేక్షించారు.