Elderly woman | వినాయక్ నగర్, జూన్ 19 : నిజామాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. జీవితంపై విరక్తి చెంది ఆమె రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా రైల్వే ఎస్సై సాయి రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
గురువారం ఉదయం 6.10 నిజామాబాద్ స్టేషన్ మేనేజర్ సీహెచ్ సాగర్ వివరాల ప్రకారం.. నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ (60) గుర్తు తెలియని కారణాలచే జీవితంపై విరక్తి చెంది రైలు క్రింద తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నది. ఈ విషయంలో ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకొని శవాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ రూంకు తరలించినట్లుగా ఎస్సై వెల్లడించారు.
మృతురాలి ఆచూకీ సంబంధించి ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. మృతురాలికి సంబంధించిన ఏవైనా వివరాలు తెలిసినవారు 87126 58591 నిజామాబాద్ రైల్వే ఎస్సై నెంబర్కు సమాచారం ఇవ్వగలరని పేర్కొన్నారు.