ఆర్మూర్ : ఆర్మూర్ పట్టణంలోని మంచినీటి సరఫరా అయ్యే మంచినీటి కేంద్రాన్ని మున్సిపల్ కమిషనర్ రాజు (Municipal Commissioner Raju) శనివారం పరిశీలించారు. రానున్న వేసవి దృష్ట్యా పట్టణంలో తాగునీటి సమస్య (Drinking water) తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
తాగునీటి పైప్లైన్లతో పాటు, నీటి ట్యాంకులను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం రామ్‌నగర్‌లో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను (School ) ఆకస్మికంగా తనిఖీ చేశారు . పాఠశాల పరిసరాలను పరిశీలించారు.విద్యార్థులకు క్రమశిక్షణ ఎంతో అవసరమని, కష్టపడి చదువుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి విద్యార్థులకు భోజనాన్ని వడ్డించారు.