కంఠేశ్వర్, సెప్టెంబర్ 25 : రోడ్డుప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు.
పోలీస్, రవాణా, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్, జాతీయ రహదారుల సంస్థ, జిల్లా వైద్యారోగ్య శాఖ, ఆర్టీసీ, రెడ్‌క్రాస్ ప్రతినిధులతో సమావేశమై రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి సూచనలు చేశారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న స్థలాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాలన్నారు. డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని, అధికారులందరూ సమన్వయంతో పనిచేసి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషిచేయాలని అన్నారు.