వినాయక్‌నగర్,జనవరి 28: జిల్లాలోని ఇందల్వాయి పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్నారన్న సమాచారం తో ఆదివారం టాస్క్‌ఫోర్స్ బృందం దాడులు నిర్వహించి, ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకుంది. ఇందల్వాయి మండలంలోని ఎల్లారెడ్డి పల్లి శివారులో మొరం తవ్వుతున్న స్థావరం పై టాస్క్‌ఫోర్స్ ఏసీపీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో సీఐ అంజయ్య సిబ్బందితో కలిసి దాడిచేశారు. దాడిలో అక్కడి నుంచి ఒక జేసీబీ, ఏడు ట్రాక్టర్లను సీజ్ చేసి,8 మందిని అదుపులోకి తీసుకున్నారు. సీజ్ చేసిన వాహనాలతోపాటు అదుపులోకి తీసుకున్న వారిని ఇందల్వాయి ఎస్సైకి అప్పగించారు. దాడుల్లో టాస్క్‌ఫోర్స్ సిబ్బంది రాంచందర్, గజేంధర్, ఆజాం పాల్గొన్నారు.