ధర్పల్లి: గ్రామీణ ప్రాంతాల్లో ప్రతినెల రెండవ శనివారం నిర్వహించిన ఆరోగ్య మేళా ( Health Mela ) ధర్పల్లి మండలంలో విజయవంతమయ్యింది. ఆరోగ్యమేళాను ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. రాజు, ఎన్.హెచ్.ఎం డిస్టిక్ ప్రోగ్రామ్ ఆఫీసర్ విశాలరాణి సందర్శించి ప్రజల స్పందనను అడిగితెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఆరోగ్యశాఖ ( Medical Department) ఆధ్వర్యంలో చిన్నారులకు వైద్యులు శివశంకర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ చంద్ర శేఖర్ ఆరోగ్యమేళాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 169 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరం ఉన్నవారికి రక్త నమూనాలను సేకరించి, వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు. తీవ్ర అనార్యోగ సమ్యలుంటే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చూపించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు మౌనిక, శివశంకర్, చంద్ర శేఖర్, నర్సింగ్ అధికారి శ్రీదేవి, సిబ్బంది కృష్ణ, మురళి, సంతోష్, సురేష్, లింగం,వాజీద్పా ల్గొన్నారు.