రుద్రూర్ : నిజామాబాద్ జిల్లా రుద్రూర్ (Rudrur) మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొర్ర చిన్న సాయిలు (45) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు బురదలో (Mud) పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొర్ర చిన్న సాయిలు చేపలు పట్టేందుకు వల తీసుకొని వెళ్లి బొప్పాపూర్ శివారులో గుండ్ల వాగు వద్ద మంగళ వారం రాత్రి వల వేసి తిరిగి వస్తున్న నేపథ్యంలో ప్రమాదవశాత్తు బురదలో కాలు జారి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నాడు. మృతుని భార్య గోదావరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్సై సాయన్న ( SI Sayanna ) తెలిపారు.