ఉమ్మడి జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హన్మంతు, ఆశీష్ సంగ్వాన్ పాల్గొని, జాతీయ జెండాను ఆవిష్కరించారు.
వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. రెండు జిల్లాల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 26