ఇందల్వాయి, ఆగస్టు 30 : ఎన్నికలు సమీపిస్తున్నందున కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మొద్దని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన 70 మంది యువకులు బుధవారం బీజేపీని వీడి బీఆర్ఎస్లో చేరగా, నగరంలోని క్యాంపు కార్యాలయంలో వారికి బాజిరెడ్డి.. గులాబీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయని అన్నా రు.
గత పాలకులు గ్రామీణ ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. తెలంగాణ వచ్చాక పల్లెలు అభివృద్ధి చెందాయని, పచ్చదనంతో కళకళలాడుతున్నాయని తెలిపారు. యువతకు సీఎం కేసీఆర్ అనేక ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారని, గ్రామీణ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని, పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. ఎంపీపీ రమేశ్‌నాయక్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దాసు, ఎస్సీ సెల్ రూరల్ కన్వీనర్ పాశంకుమార్, నాయకులు గంగాధర్, గంగాధర్‌గౌడ్, ఎంపీటీసీ రవి, సతీశ్‌కుమార్, రాజేశ్, గంగాధర్, గణేశ్‌కుమార్ పాల్గొన్నారు.