వేల్పూర్/ఆర్మూర్/ఆర్మూర్ టౌన్/ మాక్లూర్/ ఖలీల్‌వాడి/సదాశివనగర్/నవీపేట/కామారెడ్డి రూరల్, అక్టోబర్ 31 : సీఎం కేసీఆర్ జనరంజక పాలన, జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై అన్ని నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికల పరంపర కొనసాగుతున్నది. ప్రతిపక్ష పార్టీల్లోని కార్యకర్తలు, నాయకులు వందలాదిగా బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు.
తాజాగా కమ్మర్పల్లి, ఏర్గట్ల మండలం బట్టాపూర్, మోర్తాడ్ మండలం శెట్పల్లి, భీమ్‌గల్ మండలం పిప్రి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ఇతరులు సుమారు 500 మంది వేల్పూర్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో మంగళవారం చేరారు. వారి కి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆర్మూర్ మండలం అంకాపూర్లోని ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం మాక్లూర్ మండలం రాంచంద్రపల్లికి చెందిన 200మంది బీజేపీ నాయకులు, యువకులు, ఆర్మూర్ పట్టణంలోని మహాలక్ష్మి కాలనీకి చెందిన పలువురు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
మాక్లూర్ మండలంలోని చిన్నాపూర్ గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ అహ్మద్‌పాషా ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సమక్షంలో తిరిగి బీఆర్ఎస్లో చేరారు.
అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా సమక్షంలో గోల్ హన్మాన్ వైశ్య సంఘం అధ్యక్షుడు, జెండా బాలాజీ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చిన్నగంగారాం, సభ్యులు, దుబ్బ ఆర్య వైశ్య సంఘం కార్యవర్గ సభ్యులు, మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ ఎస్‌లో చేరారు. వీరికి ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
50వ డివిజన్‌కు చెందిన బీజేపీ నాయకులు సుమారు 100 మంది సైతం గణేశ్ గుప్తా సమక్షంలో బీఆర్ఎస్ చేరారు.
ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ సమక్షంలో సదాశివనగర్ మండలం ఉత్తునూర్ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బోధన్ ఎమ్మెల్యే షకీల్ సమక్షంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు నవీపేట్లో బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
కామారెడ్డి మండల కేంద్రంలోని చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉప సర్పంచ్ మీసాల అనిత, భర్త రాజిరెడ్డి ప్రభుత్వ విప్ గంపగోవర్ధన్, ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు సమక్షంలో కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరారు.