మోర్తాడ్, ఆగస్టు 25: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది.ప్రాజెక్ట్‌లోకి 34, 952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది.
ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు (80.5టీఎంసీలు) కాగా, ఆదివారం ప్రాజెక్ట్‌లో 1083.2అడుగుల (54.292టీఎంసీలు) నీరు నిల్వ ఉన్నది. ప్రాజెక్ట్ నుంచి 3,822 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది.