మార్కెట్లో సంక్రాంతి సందడి

అందుబాటులో విభిన్న రకాల గాలిపటాలు
కొనుగోలుదారులతో కళకళలాడుతున్న దుకాణాలు
పతంగులకు భలే గిరాకీ
ఖలీల్వాడి, జనవరి 10 : నిజామాబాద్ జిల్లాలో సంక్రాంతి సందడి మొదలైంది. పండుగకు నాలుగు రోజుల ముందు నుంచే మార్కెట్లు కళకళలాడుతున్నాయి. పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలోని నెహ్రూపార్కు ప్రాంతంలో పతంగులు, మాంజా విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా గాలిపటాలు కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్లో ఈసారి విభిన్న రకాల పతంగులు వచ్చాయి. ఫిష్, చోటాభీమ్, సినిమా హీరో, హీరోయిన్లు, రాజకీయ ప్రముఖులు, స్పైడర్మన్, సీతాకోకచిలుక, బెన్-10, పొడవైన పాము, జాతీయ జెండా, పబ్జీ, డేగ తదితర ఆకృతుల్లో పతంగులు అందుబాటులో ఉన్నాయి. పతంగులతోపాటు మాంజాలకు సైతం గిరాకీ ఉంది. పండుగ కోసం డజన్ల కొద్దీ పతంగులు ముందుగానే కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. పిల్లలు ఎక్కువగా కార్టూన్, స్పైడర్మన్, బెన్-10 వంటి గాలిపటాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నిలువెత్తు గాలిపాటాలతో యువకులు సందడి చేస్తున్నారు.
గిరాకీ బాగుంది..
కొవిడ్ నిబంధనల ప్రకారం పతంగు లు అమ్ముతు న్నాం. ప్రస్తుతం గి రాకీ బాగానే ఉం ది. ప్రతి సంవత్స రం పతంగులకు గి రాకీ ఉంటుంది. ఈ సారి వివిధ రకాల పతంగులు తీసుకొచ్చాం. చిన్నారులు ఎక్కువగా చోటా భీమ్, ఫిష్ పతంగులను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.
-అశ్వాఖ్ అలీ, షాపు నిర్వాహకుడు