శుక్రవారం 22 జనవరి 2021
Nizamabad - Jan 06, 2021 , 01:22:47

క్యాలెండర్‌తో కార్యాచరణ : జిల్లా జడ్జి

క్యాలెండర్‌తో కార్యాచరణ : జిల్లా జడ్జి

నిజామాబాద్‌ లీగల్‌, జనవరి 5 : కాలానికి అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవడానికి  క్యాలెండర్‌ ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జి కె.సాయి రమాదేవి అన్నారు. నిజామాబాద్‌ జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సొసైటీ క్యాలెండర్‌ను  మంగళవారం తన చాంబర్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోవర్ధన్‌, సొసైటీ అధ్యక్షుడు నీలకంఠరావు, కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి నరేందర్‌రెడ్డి, డైరెక్టర్లు వసంత్‌రావు, రవిరాజ్‌, ఉదయ్‌కృష్ణ, బార్‌ మాజీ ప్రధాన కార్యదర్శి పరుచూరి శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. logo