శనివారం 16 జనవరి 2021
Nizamabad - Dec 19, 2020 , 01:10:11

వాహనదారులు నిబంధనలను పాటించాలి

వాహనదారులు నిబంధనలను పాటించాలి

నిజామాబాద్‌ సిటీ: నిజామాబాద్‌ ఏసీపీ కార్యాల యంతోపాటు ట్రాఫిక్‌ పోలీ సు స్టేషన్‌ను కమిషనర్‌ కార్త్తికేయ శుక్రవారం తనిఖీ చేశా రు. కార్యాలయాల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.   

ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌ తని ఖీ అనంతరం సీపీ మాట్లాడారు. వాహనదారులు మోటర్‌వెహికిల్‌ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ పోలీసులకు సహకరించాలని అన్నారు. వాహనదారులు పెండింగ్‌లో ఉన్న జరిమానాలను వెంటనే ఆన్‌లైన్‌లో చెల్లించాలని సూచించారు. చలానాలు పెండింగ్‌లో ఉన్న వాహనాలను సీజ్‌ చేయడం జరుగుతుందన్నారు.  నగరంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఏసీపీ ప్రభాకర్‌రావును సీపీ ఆదేశించారు.  కార్యక్రమంలో నిజామాబాద్‌ డివిజన్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌, ట్రాఫిక్‌ ఏసీపీ ప్రభాకర్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.