శనివారం 30 మే 2020
Nizamabad - Apr 25, 2020 , 02:59:19

బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అండ

బాధిత కుటుంబానికి మంత్రి కేటీఆర్‌ అండ

  • యువకుడి ట్వీట్‌కు స్పందించిన మంత్రి
  • ఆదుకుంటామని అధికారుల హామీ 

శక్కర్‌నగర్‌: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణం 3వ వార్డు శక్కర్‌నగర్‌లో ఓ బాధిత కుటుంబం దీనస్థితిని వాట్సాప్‌, ట్విట్టర్‌ ద్వారా చూసిన రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ఆపన్నహస్తం అందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో స్పందించిన కలెక్టర్‌ నారాయణరెడ్డి బోధన్‌ ఆర్డీవోకు విషయాన్ని వివరించి వివరాలు తెలుసుకోవాలని సూచించారు. దీంతో ఈ నెల 23న రాత్రి కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు బోధన్‌ ఆర్డీవో గోపీరాం, తహసీల్దార్‌ గఫార్‌మియా, కౌన్సిలర్‌ రాధాకృష్ణతో కలిసి సదరు కుటుంబాన్ని పరామర్శించారు. బాధితురాలు బొందిల యశోద భర్త గతంలో మరణించాడు. యశోద సైతం పక్షవాతానికి గురైంది. ఈ క్రమంలో తన ఎనిమిదేండ్ల కూతురు అన్నీతానై పనులూ చేస్తుండడాన్ని గమనించిన అధికారులు లాక్‌డౌన్‌ అనంతరం యశోదకు చికిత్స చేయిస్తామని, కూతురు రాజరాజేశ్వరిని చదివించే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణం 12 కిలోల బియ్యాన్ని, రూ.వెయ్యి నగదును అందజేశారు. బాధితురాలిని ఆదుకొనే విషయమై కలెక్టర్‌.. మంత్రి కేటీఆర్‌కు ట్వీట్‌ చేయగా.. మంత్రి కేటీఆర్‌ కలెక్టర్‌, బోధన్‌ ఆర్డీవోకు ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.


logo