సోమవారం 25 జనవరి 2021
Nizamabad - Apr 07, 2020 , 03:17:18

‘పాజిటివ్‌' టెన్షన్‌

‘పాజిటివ్‌' టెన్షన్‌

  • నిజామాబాద్‌లో మరో పది కేసులు
  • కంటైన్‌మెంట్‌  ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం 
  • ఆయా ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆరోగ్య సిబ్బంది సర్వే 
  • కార్వంటైన్‌ కేంద్రాల్లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులపై వైద్య సిబ్బంది పర్యవేక్షణ
  • nలాక్‌డౌన్‌కు సహకరించాలంటున్న అధికారులు

నిజామాబాద్‌/నమస్తే తెలంగాణ ప్ర తినిధి: నిజామాబాద్‌ జిల్లాలో మరో పది పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ నారాయణరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం సీపీ కార్తికేయతో కలిసి కొత్తగా నమోదైన కరోనా వైరస్‌ కేసులు, తదుపరి యంత్రాంగం తీసుకునే చర్యలపై ప్రగతిభవన్‌ సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో కలెక్టర్‌ మాట్లాడారు. మొన్న పంపిన 41 శాంపిళ్లలో 20 నమూనాలకు సోమవారం రిపోర్ట్స్‌ వచ్చాయని అందులో పది మందివి పాజిటివ్‌గా ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు జిల్లా లో మొత్తం 29 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కలెక్టర్‌ వివరిచారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన 58 మందిలో వారి ప్రైమ రీ, సెకండరీ కాంటాక్ట్స్‌, కుటుంబ సభ్యుల వివరాలు సేకరించడానికి యంత్రాంగం అన్ని చర్యలూ తీసుకుందన్నారు. ఏ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో ఈ కరోనా లక్షణాలు బయటపడ్డాయో ఆ ప్రాంతాలను కంటైన్‌మెంట్‌గా గుర్తించి అక్కడ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, ఆ ప్రాంతాల ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాకుండా, బయట ప్రజలు ఆ ప్రాంతాలకు వెళ్లకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జిల్లాలోని మాక్లూర్‌, నందిపేట్‌, బోధన్‌, రెంజల్‌, భీమ్‌గల్‌, బా ల్కొండతో పాటు నిజామాబాద్‌ నగరంలోని అహ్మద్‌పురా కాలనీ, మాలపల్లి, హబీబ్‌నగర్‌, ఆటోనగర్‌, ఖిల్లా రోడ్లను కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా గుర్తించామని తెలిపారు. సోమవారం వరకు జిల్లాలో 210 మంది ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంటున్నారన్నారు. 29 పాజిటివ్‌ కేసు లు అంటే పెద్ద సంఖ్య అని, ఇది చాలా క్లిష్టమైన పరిస్థితులకు సంకేతమని, బయటకు వెళ్తే ప్రమాదకరమని ప్రజ లు గుర్తించాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారమే వైద్య సిబ్బందికి రక్షణ పరికరాలు అందిస్తున్నామని, రోగులకు చికిత్స అందించే వారికి, వారిని తాకే వారికి పీపీ కిట్స్‌ అవసరమని మి గతా వారికి అవసరం లేదని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఐదు వందల పడకలను కరోనా కేసుల కోసం కేటాయించామన్నారు. దీంతోపాటు ఇతర వ్యాధులకు కూడా ఇదే ప్రభుత్వ దవాఖానలో చికిత్స అందించడానికి ప్రైవేట్‌ డాక్టర్లు, ఐ ఎంఏ డాక్టర్ల సేవలు తీసుకోనున్నామని, ప్రైవేట్‌ దవాఖానల ద్వారా కూడా వైద్య సేవలు అందిస్తామన్నారు. 

అవగాహన కల్పిస్తున్నాం.. సీపీ కార్తికేయ 

మైనార్టీ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ కార్తికేయ తెలిపారు. ఉర్దూలో అర్థమయ్యేలా చేస్తున్నామని, ఎక్కువగా కేసులు వస్తున్నందున సహకరించాలని ప్రజలకు సూచిస్తున్నామన్నారు. 


logo