శనివారం 06 జూన్ 2020
Nizamabad - Jan 12, 2020 , 02:00:25

అందుబాటులో ఉండి సేవచేస్తా..

అందుబాటులో ఉండి సేవచేస్తా..


ఆర్మూర్‌, నమస్తే తెలంగాణ: ఆర్మూ ర్‌ మున్సిపల్‌ పరిధిలోని 6వ వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటు లో ఉండి సేవచేస్తానని ఆ వార్డు టీ ఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇట్టెడి గంగారెడ్డి అ న్నారు. ప్రజా సమస్యల పరిష్కా రం, ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన పే ర్కొన్నారు. శనివారం ఆయన ‘నమ స్తే తెలంగాణ’తో పలు అంశాలపై మాట్లాడారు.

నమస్తే తెలంగాణ: రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకున్నారు?

ఇట్టెడి గంగారెడ్డి: ప్రజలకు సేవ చే యాలన్న సంకల్పంతోనే రాజకీయా ల్లో వస్తున్నా. ఈ దఫా ఆర్మూర్‌ ము న్సిపల్‌లో 6 వార్డు నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. స్థానికంగా ఉంటూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటా సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తా. 

ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించే అంశా లు ఏవని భావిస్తున్నారు?

గంగారెడ్డి: తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చి న పార్టీగా, బంగారు తెలంగాణ సా ధనే టీఆర్‌ఎస్‌ పార్టీ తరపున పోటీ చేయడం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు బోనస్‌. వార్డులో స్థానికంగా ఉం టూ యువకుడిగా వార్డు ప్రజల ఆశీస్సులతో రాజకీయ అరంగేట్రం చే స్తున్నా. స్థానిక సమస్యలపై నాకు అ వగాహన ఉంది. ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ సెగ్మెంట్‌ ఇన్‌చార్జి రాజేశ్వర్‌రెడ్డి సాయంతో 6 వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతా.

కౌన్సిలర్‌గా గెలిపిస్తే వార్డులో ఎలాం టి అభివృద్ధి పనులు చేయిస్తారు?

గంగారెడ్డి: 6వ వార్డు పరిధిలోని ప్రజలు నన్ను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తారన్న నమ్మకం నాకుంది. వార్డులో మూడు ప్రధాన రోడ్లలో బీటీ రోడ్లు పూర్తి చేయిస్తా. అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయిస్తా. వినాయక్‌నగర్‌ కాలనీలోని పార్కును అభివృద్ధి చేసి ఓపెన్‌ జిమ్‌ను ఏర్పాటు చేయిస్తా. కోటార్మూర్‌లోని శ్మశాన వాటికికు కౌన్సిలర్‌గా విజయం సాధించిన ఏడాదిలోనే నిర్మాణం  చేయిస్తా.


logo