మాక్లూర్, జూలై 14: సరిగ్గా 23ఏండ్ల క్రితం పదో తరగతి చదివిన విద్యార్థులంతా ఒక్కచోట కలిశారు. కాలినడకన పాఠశాలకు చేరుకున్న పరిస్థితులను మననం చేసుకున్నారు. విద్యార్థి దశలోని స్మృతులను గుర్తుచేసుకొని సంతోషంగా గడిపారు మాక్లూర్ జడ్పీహెచ్ఎస్ పూర్వ విద్యార్థులు.
2001-02లో పదో తరగతి చదివిన వారంతా కలిసి మాక్లూర్ మండల కేంద్రంలో ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అనంతరం ఉపాధ్యాయుల సేవలను గుర్తుచేసుకుంటూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉపాధ్యాయులు అప్పల కిష్టయ్య, బాగేందర్, భూపతిరెడ్డి, మల్కయ్య, రవీందర్గుప్తా, వేణుగోపాల్, గంగారెడ్డి, వెంటక రాజయ్య, దామోదర్, పురుషోత్తం, దాస్ పాల్గొన్నారు.