ధర్పల్లి, మార్చి 15 : 120 ఏండ్ల బామ్మ.. తన పనులను తాను చేసుకుంటూ ఆందరినీ ఔరా అని ఆశ్చర్యపరుస్తోంది. ధర్పల్లి మండలంలోని దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన గయాన బాబాయి నూటా ఇరవై ఏండ్లు ఉంటాయి.. ఆమెకు ముగ్గురు కుమారులు, నలుగురు కుమార్తెలు కాగా.. ఇప్పుడు మనుమలు, ముని మనుమలు, మనుమరాండ్లతో ఆ కుటుంబం అలరారుతున్నది.
మంచి ఆహార పదార్థాలను తీసుకోవడమే ఆమె ఆరోగ్య రహస్యమని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబీకులు శనివారం ఆమెకు పాదపూజ చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.