ఆర్మూర్, ఆగస్టు 9 : ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకే ‘నమస్తే’ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మండలంలోని గోవింద్‌పేట్ గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి సోమవారం పర్యటించారు. వార్డుల వారీగా ఇంటింటికీ తిరిగి ప్రజలతో మాట్లాడారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆధికారులను ఆదేశించారు. కరోనా, అనారోగ్య సమస్యలతో మృతి చెందిన 25 కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి ధైర్యం చెప్పారు. గ్రామానికి చెందిన మల్లయ్య మృతిచెందగా.. ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బండమీది జమున, ఉప సర్పంచ్ బండమీది గంగాధర్, ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, టీఆర్ఎస్ నాయకులు అప్పాల ఆనంద్‌రెడ్డి, అప్పాల సురేశ్‌రెడ్డి, గణేశ్, అశోక్, గంగాధర్, గంగారెడ్డి, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
రోడ్డు నిర్మాణం హామీపై చిన్నయానం గ్రామస్తుల హర్షం
నందిపేట్ మండలంలోని చిన్నయానం గ్రామానికి అసంపూర్తిగా ఉన్న డబుల్ రోడ్డును పూర్తిచేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. దీనిపై హర్షం వ్యక్తంచేసిన గ్రామస్తులు గోవింద్‌పేట్ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యేను కలిసి ధన్యవాదాలు తెలిపారు. సర్పంచ్ ఇస్తారి శ్రీను, ఉప సర్పంచ్ భూపతి, టీఆర్ఎస్ నందిపేట్ మండల అధ్యక్షుడు నక్కల భూమేశ్, సోషల్ మీడియా ప్రతినిధి గడ్డం చిన్నారెడ్డి, వార్డు మెంబర్లు, వీడీసీ సభ్యులు ఉన్నారు.
నిధుల మంజూరుకు హామీ
సంఘ భవన నిర్మాణానికి సహకరించాలని కోరూతూ పట్టణ పరిధిలోని పెర్కిట్ గంగపుత్రులు ఎమ్మెల్యే జీవన్‌రెడ్డికి సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి రూ. 10 లక్షలు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. సంఘం అధ్యక్ష, కార్యదర్శులు లింగం, రాజేశ్వర్, సభ్యులు గంగాధర్, పెంటయ్య, నరేందర్, రాధాకిషన్, కిషన్, లక్ష్మీనారాయణ, రాములు, శ్రీనివాస్ పాల్గొన్నారు.