నిజామాబాద్ రూరల్, ఆగస్టు 10: పశు సంపదను సృష్టించడంతోపాటు పాడి పశువులకు గోపాలమిత్రలు, పశువైద్య సిబ్బంది సమన్వయంతో వైద్య సేవలందించాలని రాష్ట్ర లైవ్‌స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ(ఎల్డీఏ) ముఖ్య కార్యనిర్వహణాధికారి మంజువాణి ఆదేశించారు. సారంగాపూర్ శివారు లో ఉన్న జిల్లా పశు గణాభివృద్ధి సంఘం కార్యాలయ ఆవరణలో ఉమ్మడి జిల్లాల గోపాలమిత్రలు, సూపర్వైజర్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమా వేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల ఇండ్ల వద్దకే వెళ్లి కృత్రిమ గర్భాధారణ ద్వారా మేలు జాతి పశువులు జన్మించేలా గోపాలమిత్రలు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. వీరి సేవలను గుర్తించి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వని విధం గా గోపాలమిత్రలకు నెలకు రూ.8,500 వేతనం చెల్లిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందని స్పష్టం చేశారు. పశువులు ఎదకు వచ్చిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నా రు. పశు వైద్య సేవలందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలకు మెడికల్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించేందుకు ఎల్డీఏ తరఫున రూ.20 లక్షలు చెల్లించడం జరిగిందని చెప్పారు. ప్రతిఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఏవై నా లోటుపాట్లు ఉంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. రైతులు వ్యవసాయంతోపాటు పాడిపరిశ్రమపై ఆసక్తి చూపడంతోనే ఆర్థికంగా బలపడుతున్నందున రాష్ట్రం లో ఆత్మహత్యలు లేకుండా పోయాయన్నా రు. అనంతరం సీఈవోను అధికారులు, గోపాలమిత్రలు శాలువాతో సత్కరించారు. సమావేశంలో జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ భరత్, జిల్లా పశు గణాభివృద్ధి సంఘం చైర్మన్ రాజలింగం, ఈవో శ్రీశైలం, విజయ డెయిరీ డీడీ నందకుమారి, పశు సంవర్ధక శాఖ ఏడీలు డాక్టర్ బాలిక్ అహ్మద్, డాక్టర్ బస్వారెడ్డి, మండల పశు వైద్యాధికారులు రతన్, హన్మంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.