పంటల వివరాలు నమోదు చేయాలి

- వీసీలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి
నిర్మల్ టౌన్ : యాసంగి సీజన్‌కు సంబంధించిన పంటల సాగు వివరాలను ఆన్లైన్లో పక్కాగా నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారులను వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి గురువారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఆయా గ్రామాల్లో రైతులు సాగు చేసిన పంటల విస్తీర్ణాన్ని ఏఈవోలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తిచేయాలని పేర్కొన్నారు. ప్రస్తుతం పండించిన పంటలకు సంబంధించి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని, రైతులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని మార్కెటింగ్ శాఖ అధికారులకు సూచించారు. అనంతరం మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లపై సమీక్షించారు. జిల్లాలో పూర్తిస్థాయిలో మక్కలను కొనుగోలు చేయాలన్నారు. ఇప్పటివరకు 70వేల క్వింటాళ్ల మక్కలు కొనుగోలు చేసినట్లు జిల్లా అధికారులు ఆయనకు వెల్లడించారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, మార్కెటింగ్‌శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్, మార్క్‌ఫెడ్ అధికారులతో పాటు వ్యవసాయశాఖ అధికారులు వసంత్‌రావు, నాగారాజు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
- వ్యాక్సిన్‌పై వదంతులను నమ్మకండి: కేజ్రివాల్
- టెస్టింగ్ తర్వాతే టీకాలకు అనుమతి : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
- ప్రియురాలిని హత్య చేసి.. గోడలో శవాన్ని దాచి
- కోవాగ్జిన్ సమర్థతపై అనుమానాలు వద్దు..
- వ్యాక్సిన్ తీసుకున్న ఎయిమ్స్ డైరెక్టర్, సీరమ్ సీఈవో.. వీడియోలు
- అంతరిక్ష యాత్ర కేవలం రూ.96 లక్షలకే..
- అమెజాన్ ‘బ్లూ ఆరిజన్’ సక్సెస్
- ప్రజావైద్యుడు లక్ష్మణమూర్తి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
- ప్రభాస్ ‘సలార్’ లేటెస్ట్ అప్డేట్.. హీరోయిన్.. విలన్ ఎవరో తెలుసా?
- బెంగళూరు హైవేపై ప్రమాదం : ఒకరు మృతి