ఎయిడ్స్‌పై విస్తృత ప్రచారం చేయాలి

- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- పోస్టర్, బ్యానర్ విడుదల
సోన్ : ఎయిడ్స్ నివారణపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ ది నోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్లో మంగళవారం ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో తయారు చేసిన పోస్టర్, బ్యానర్‌ను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎయిడ్స్ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ మరిన్ని చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాధిగ్రస్తులపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, అవసరమైన సదుపాయాలు కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, ఎయిడ్స్ నియంత్రణ అధికారి కార్తీక్, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
కల్లాలు, శ్మశానవాటికలను వేగంగా పూర్తిచేయాలి..
కల్లాలు, శ్మశానవాటికల నిర్మాణంపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు శ్మశానవాటికలు పూర్తయిన గ్రామాలు, మిగిలిన గ్రామాల వివరాలు తెలుసుకున్నారు. ఈ నెల 31వరకు వందశాతం పూర్తిచేయాలని ఆదేశించారు. 79 క్లస్టర్ల పరిధిలో చేపట్టిన కల్లాల పనులు, ప్రారంభం కాని నిర్మాణాలపై ఆరా తీశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్రావు, జడ్పీసీఈవో సుధీర్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, జిల్లా వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, పంచాయతీరాజ్ డీఈ తుకారాం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోస్టర్ల విడుదల..
నిర్మల్ అర్బన్ : ఎయిడ్స్ దినోత్సవానికి సంబంధించిన పోస్టర్లను తన కార్యాలయంలో జిల్లా వై ద్య ఆరోగ్య శాఖ అధికారి ధన్‌రాజ్ విడుదల చేశా రు. జిల్లాలో ఎయిడ్స్ నివారణకు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అనేక చర్యలు తీసుకుంటున్న ట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో వైద్యులు ఆశిశ్రెడ్డి, దేవేందర్ రెడ్డి, అవినాశ్, రజినీ, మాస్ మీడియా అధికారి రవీందర్, వినోద్‌కుమార్, రా జేశ్వర్, కౌన్సిలర్లు సుదర్శన్, శ్రీనివాస్ ఉన్నారు.
తాజావార్తలు
- హత్య కేసు నిందితుడిపై పీడీ యాక్ట్ నమోదు
- జనవరిలోనే రవితేజ ‘క్రాక్’ ఓటిటిలో విడుదల..?
- చిరంజీవితో మరోసారి జతకడుతున్న నయనతార?
- కళ్ల కింద నల్లటి వలయాలా? ఇవి తినండి
- సిన్సినాటి డెమోక్రాట్ మేయర్ అభ్యర్థిగా ఇండో అమెరికన్
- ఈ ఐదింటిని భోజనంలో భాగం చేసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి!
- పదోన్నతుల ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలి : సీఎస్
- తొలి రోజు సక్సెస్.. 1.65 లక్షల మందికి కరోనా టీకా
- గ్రామగ్రామాన వైకుంఠధామాల నిర్మాణం : మంత్రి పువ్వాడ
- ఆస్కార్ రేస్‌లో విద్యాబాలన్ సినిమా నట్‌ఖట్