సోమవారం 18 జనవరి 2021
Nirmal - Sep 29, 2020 , 02:11:36

నిధులొచ్చాయ్‌..

నిధులొచ్చాయ్‌..

  • n పాఠశాలల నిర్వహణకు నిధులు విడుదల
  • n నిర్మల్‌ జిల్లాకు రూ.51.93 లక్షలు మంజూరు
  • n విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన బడ్జెట్‌
  • n మౌలిక వసతులు, స్వచ్ఛతకు వినియోగం
  • n ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు ఖర్చు

 సారంగాపూర్‌ : పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై సర్కారు దృష్టి సారించింది. పారిశుద్ధ్య నిర్వహణ, వసతుల కల్పనకు నిధులు విడుదల చేసింది. 2020-21 విద్యాసంవత్సరానికి గాను 25 శాతం నిధులను ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా సమగ్ర శిక్షా అభియాన్‌ పథకం ద్వారా సమకూర్చిం ది. పాఠశాలల యాజమాన్య కమిటీ(ఎస్‌ఎంసీ) తీర్మానాలకు అనుగుణంగా నిధులను వినియోగించాలి. నిధుల ఖర్చుపై ఆడిట్‌ నిర్వహణ కూడా ఉంటుంది. నిర్మల్‌ జిల్లాలోని 703 పాఠశాలల్లో 54 వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు హాజ రు కాకపోయినా ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ పాఠాలతోపాటు వర్క్‌షీట్లు అందజేసి ప్రగతిని పరిశీలించే పనుల్లో టీచర్లు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో పాఠశాలల్లో అవసరమైన సామగ్రి, కనీస వసతులు, స్వచ్ఛత చర్యల కోసం రాష్ట్ర పాఠశాల విద్య సమగ్ర శిక్ష అభియాన్‌ ద్వారా నిధులు విడుదల చేసింది. మొదటి విడుతగా 25 శాతం నిధులు రూ. 51.93 లక్షలు విడుదల చేశారు. వీటిలో ఎస్సీ కాంపోనెంట్‌ కింద 24 శాతం రూ. 12,52,500, ఎస్టీ కాంపోనెంట్‌ కింద 14 శాతం రూ.7,30,577 ఇతర విద్యార్థులకు 62 శాతం నిధులు రూ.32,35,673 కేటాయించారు.

నిధుల ఖర్చు ఇలా..

ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడి పేరిట ఉన్న సం యుక్త ఖాతాలో నిధులు జమ అవుతాయి. ఎస్‌ఎంసీ తీర్మానం మేరకు వాటిని ఖర్చు చేస్తారు.  చాక్‌పీస్‌లు, కాగితాలు, రిజిస్టర్లు, స్టేషనరీ, పరీక్షల నిర్వహణ, జాతీయ పండుగల నిర్వహణ, విద్యుత్‌ బిల్లుల చెల్లింపు, కంప్యూటర్‌, ప్రొజెక్టర్లు, టీవీ, టేబుల్‌, ఇంటర్నెట్‌, డిజిటల్‌ తరగతల నిర్వహణ ఖర్చులు, ప్రయోగశాలల పరికరాల కొనుగోలు, పాఠశాల భవనాలకు సంబంధించి చిన్నచిన్న, మరమ్మతులకు ఉపయోగించాలి. 

విద్యార్థుల సంఖ్య ఆధారంగా.. 

ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నిర్వహణ నిమిత్తం విద్యార్థుల సంఖ్య ప్రాతిపదికన నిధులను విడుదల చేసింది. ఇందులో మొదటి విడుతలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 1 నుంచి 15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 16 నుంచి 100 మంది ఉంటే రూ.25వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50 వేలు, 251 నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు, 1000 మంది కంటే ఎక్కువగా ఉంటే రూ.ఒక లక్ష చొప్పున విడుదల చేశారు. ఉన్నత పాఠశాలలకు 1 నుంచి 15 విద్యార్థులు ఉంటే రూ. 25వేలు, 16 నుంచి 100 మంది ఉంటే రూ.25వేలు, 101 నుంచి 250 మంది ఉంటే రూ.50వేలు, 251 నుంచి 1000 మంది ఉంటే రూ.75 వేలు, 1000 నుంచి అంతకంటే ఎక్కువగా ఉంటే రూ. ఒక లక్ష చొప్పున ప్రభుత్వం పాఠశాలలకు బడ్జెట్‌ను విడుదల చేసింది.

సద్వినియోగం చేసుకోవాలి..

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు నిధు లు మొదటి విడుతలో 25 శాతం విడుదల చేసింది. 2020-21 సంవత్సరానికి గాను నిర్మల్‌ జిల్లాలోని 703 ప్రభుత్వ పాఠశాలకు రూ. 51.93 లక్షలు విడుదలయ్యా యి. విడుతలవారీగా విడుదల అవుతా యి. ప్రధానోపాధ్యాయులు పాఠశాలల సౌకర్యాల కోసం ఎస్‌ఎంసీ తీర్మానం మేర కు ఖర్చు చేసుకోవాలి.

-పద్మ, సెక్టోరియల్‌ ఆఫీసర్‌, నిర్మల్‌