దేశంలో 49వ టైగర్ రిజర్వ్ అయిన ఒరాంగ్ టైగర్ ప్రాజెక్టును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం 3) మేఘాలయ 4) సిక్కిం
దేశంలో వన నిర్మూలనకు వ్యతిరేకంగా 1973లో ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో చిప్కో ఉద్యమాన్ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు? 1) పాండురంగ హెగ్డే 2) సుందర్‌లాల్ బహుగుణ 3) చాందీ ప్రాసర్ బిట్టా 4) కన్యామ్యాలాల్ మున్షీ
దేశంలో అత్యధికంగా విస్తరించి ఉండి, గరిష్ట వాణిజ్య విలువ కలిగి ఉండే అరణ్యాలు ఏవి? 1) టైడల్ అరణ్యాలు 2) రుతుపవన ప్రాంతపు అరణ్యాలు 3) ఆకురాల్చే అరణ్యాలు 4) రుతుపవన ప్రాంతపు అరణ్యాలు,ఆకురాల్చే అరణ్యాలు
కింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి? ఎ. కింగ్ ఆఫ్ ది ఫారెస్ట్ అని పిలిచే కలప
టేకు బి. గ్రీన్ గోల్డ్ (పేదవాని కలప) అని దేనిని పిలుస్తారు – వెదురు సి. భూ ఉపరితలంపై అత్యంత వేగంగా పెరిగే వృక్షం- యూకలిప్టస్ డి. అత్యంత ఎత్తు పెరిగే వృక్షం- రెడ్‌వుడ్ 1) ఎ, బి 2) బి, సి, డి 3) ఎ, సి 4) ఎ, బి, సి, డి
జతపర్చండి ఎ. ‘డాల్ బెర్జియా’ అనే వృక్ష జాతి 1. సాలిక్స్ బి. రైల్వే స్లీపర్స్ తయారీకి వినియోగించే కలప 2. సిల్వర్ పర్ సి. క్రీడాకారుల ఆటవస్తువుల తయారీకి వినియోగించే కలప 3. ఎర్రచందనం డి. అగ్గిపుల్లల తయారీకి ఉపయోగించే కలప 4. సాల్వే 1) ఎ-3, బి-4, సి-1, డి-2 2) ఎ-1, బి-2, సి-3, డి-4 3) ఎ-2, బి-3, సి-2, డి-1 4) ఎ-2, బి-3, సి-1, డి-4
1982లో దేశంలో ‘ జంగిల్ బచావో ఉద్యమం’ ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? 1) ఉత్తరప్రదేశ్ 2) హిమాచల్ ప్రదేశ్ 3) బీహార్ 4) గుజరాత్
కింది వాటిలో సరికానిది ఎ. జాతీయ పులుల దినోత్సవం- జూలై 29 బి. దేశంలోని మొత్తం టైగర్ అభయారణ్యాల సంఖ్య- 50 సి. 2019 జూలై 29 నాటి నివేదిక ప్రకారం దేశంలోని పులుల సంఖ్య- 2967 డి. దేశంలోని అత్యధిక పులుల సంఖ్య కలిగిన రాష్ట్రం- మధ్యప్రదేశ్ (526)
IFSR (Indian Forest state Report) ప్రకారం దేశంలో 2015 నుంచి 2017 వరకు పెరిగిన అడవుల శాతం? 1) 20 శాతం 2) 0.20శాతం 3) 0.6శాతం 4) 0.25 శాతం
దేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్ ప్రాంతం ఏది? 1) జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్ 2) రాజీవ్‌గాంధీ టైగర్ ప్రాజెక్ట్ 3) కన్హా నేషనల్ పార్క్ 4) గిండి నేషనల్ పార్క్
దేశంలో గ్రీన్‌డేను ఎప్పుడు నిర్వహిస్తారు? 1) జూలై-12 2) జూలై-21 3) జూలై-15 4) జూలై-10
దేశంలోని అతిచిన్న జీవావరణ కేంద్రం ఏది? 1) రాణ్ ఆఫ్ కచ్ (గుజరాత్) 2) పన్నా (మధ్యప్రదేశ్) 3) నీలగిరి (తమిళనాడు) 4) దిబ్రుపైకోవా (అసోం)
సేవ్ నల్లమల ఉద్యమం యురేనియం తవ్వకాల నిలిపివేతకు చెందిన నల్లమల అటవీ క్షేత్రం తెలంగాణలోని ఏ జిల్లాలో విస్తరించి ఉంది? 1) నాగర్‌కర్నూల్ 2) నల్లగొండ 3) వనపర్తి 4) నాగర్ కర్నూల్, వనపర్తి
భారతదేశ భౌగోళిక అంశాల్లో సరికానిది? 1) భారత్ ఖండ భూభాగం దృష్ట్యా గోండ్వానా పలకకు చెందింది 2) అక్షాంశాల పరంగా 80 370 6 మధ్య ఉత్తరార్ధ గోళంలో ఉంది 3) దేశానికి ఇండియా అనే పేరు సింధునది పేరు మీద వచ్చింది 4) గ్రీకులు ఇండోయిలు అనే పదాన్ని ఆధారంగా చేసుకొని ఇండియాగా పిలిచారు
ఎ. భారత ఉపఖండపు దేశాల మొత్తం సంఖ్య-7 బి. ఉపఖండపు దేశాలన్ని కలిసి ప్రస్తుతం ఒక ప్రాంతీయ, ఆర్థిక సహకార కూటమిగా (సార్క్)గా ఏర్పడి ఉన్నాయి 1) ఎ సరైనది 2) బి మాత్రమే సరైనది 3) ఎ, బి రెండూ సరైనవే 4) ఎ, బి రెండూ సరికానివి
కింది అంశాల్లో సరైనది గుర్తించండి? ఎ. 23 1/2 ఉత్తర అక్షాంశం అయిన కర్కటరేఖ దేశంలో 8 రాష్ర్టాల గుండా ప్రయాణిస్తుంది బి. భారత ప్రామాణిక రేఖాంశం 82 1/2 o తూర్పు రేఖాంశం సి. భారత ప్రామాణిక రేఖాంశం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని కాకినాడ పట్టణం గుండా ప్రయాణిస్తుంది 1) ఎ సరైనది 2) ఎ, బి సరైనవి 3) ఎ, సి సరైనవి 4) బి, సి సరైనవి
ఈ కింది వాటిని పరిశీలించుము? ప్రతిపాదన (ఎ): హిందూ మహాసముద్రంలో భారత ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల దూరం వరకు విస్తరించి ఉన్నాయి కారణం (ఆర్): భారత ప్రాదేశిక జలాల్లోకి ఇతర దేశ నౌకలు ముందస్తు అనుమతి లేకుండా ప్రవేశించవచ్చు 1) ఎ, ఆర్ నిజమైనవి. ఎ కు ఆర్ సరైన వివరణ 2) ఎ, ఆర్ నిజమైనవి. కానీ ఎ కు ఆర్ సరైన వివరణ కాదు 3) ఎ నిజమైనది, ఆర్ నిజమైనది కాదు 4) ఎ నిజమైనది కాదు, ఆర్ నిజమైనది
కింది వాటిలో సరైనది ఏది? 1) బియాస్, రావి నదుల మధ్యగల అంతర్వేది- బారి 2) రావి, చినాబ్ నదుల మధ్యగల అంతర్వేది- రేచనా 3) బియాస్, సట్లెజ్ నదుల మధ్యగల అంతర్వేది- బిస్త్ 4) పైవన్నీ సరైనవే
తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ప్రచురించే మాస పత్రిక? 1) వనజ్ఞాని 2) వన సంరక్షిణి 3) వనజ్ఞాపిక 4) వనదీపిక
కింది వాటిలో సరికానిది? ఎ. దేశంలోని ఏనుగు రిజర్వుల సంఖ్య-32 బి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం- ఆగస్టు 12 సి. కేంద్ర ప్రభుత్వం ఏనుగుల సంరక్షణ కోసం చేపట్టిన కార్యక్రమం ‘గజ్యాత్ర’ డి. దేశంలో ఏనుగులు కలిగిన రాష్ర్టాల సంఖ్య- 16 1) ఎ, బి 2) ఎ, సి 3) బి, డి 4) ఏదీకాదు
ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? 1) మార్చి 20 2) మార్చి 3 3) జూన్ 5 4) మే 3
కింది వాటిలో సరైనది? 1) ప్రపంచ పర్యావరణ దినోత్సవం- జూన్ 5 2) మొదటిసారిగా ప్రపంచ పర్యావరణ దినం- 1972లో (స్టాక్‌హోం) సమావేశంలో ప్రకటించారు. 3) 2019 ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్- Beat Air pollution 4) పైవన్నీ సరైనవే
కింది వాటిలోసరికానిది 1) తెలంగాణ బయోడైవర్సిటీ పార్క్ గచ్చిబౌలి 2) కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యావన విశ్వవిద్యాలయం ములుగు (సిద్దిపేట) 3) 5వ విడత హరితహారం కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం అధికంగా చింతచెట్ల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చింది 4) ప్రాంతీయ అటవీ పరిశోధనా కేంద్రం తెలంగాణలోని ధూళిపాళ్ల
సెప్టెంబర్ 17 2019న ప్రధాని మోదీ సందర్శించిన బటర్ ఫ్లై గార్డెన్ ఏ రాష్ట్రంలో ఉంది? 1) రాజస్థాన్ 2) మధ్యప్రదేశ్ 3) గుజరాత్ 4) కర్ణాటక