e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 19, 2022
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ దక్కన్‌ టైమ్స్‌ ఎప్పుడు ప్రారంభమైంది?

దక్కన్‌ టైమ్స్‌ ఎప్పుడు ప్రారంభమైంది?

సురభి మాధవరాయలు (క్రీ.శ.1650)
ఈయన పాలమూరు జిల్లాలోని జటప్రోలు సంస్థాన పాలకుడు
చంద్రికా పరిణయం అనే ప్రబంధాన్ని రచించాడు.
నోట్‌: చంద్రికా పరిణయం అనే ప్రబంధానికి వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రి ఇద్దరూ కలిసి ‘శారదాగమనం’ అనే బృహత్‌వ్యాఖ్యానం’ రాశారు.
పొనుగోటి జగన్నాథాచార్యులు (క్రీ.శ.1650)
ఈయన దేవరకొండ దుర్గం పాలకుడు, స్వయంగా కవి.
ఈయన ‘కుముదవల్లి విలాసం’ రచించాడు. ఇది భక్తరామదాసు జీవితానికి దగ్గరగా ఉంటుంది.
మరింగంటి జగన్నాథాచార్యులు (క్రీ.శ.1550-80)
కలలో రంగనాథుడు ఆదేశించాడని ‘శ్రీరంగనాథవిలాపం’ అనే ప్రబంధం రాశాడు.
ఈయన బిరుదు ‘శతావధాన శత లేఖినీ సార్వభౌమ’
మరింగంటి సింగరాచార్యులు (క్రీ.శ.1520-90)
బిరుదులు: శతఘంటావధాని, అష్టభాషా కవితావిశారదుడు
రచనలు: 1.రాజనందన చరిత్ర
2. సీతాకల్యాణం (మొదటి అచ్చ తెలుగు నిరోష్ట్య రచన)
3. వరదరాజు స్తుతి 4. శ్రీరంగ శతకం
5. రామకృష్ణ విజయం (ద్వర్థికావ్యం)
6. దశరథ రాజనందన చరిత్ర (నిరోష్ట్య కావ్యం)
7. రాఘవపాండవీయం
నోట్‌: పదహారేండ్ల వయస్సులో నలయాదవ రాఘపాండవీయం అనే నాలుగర్థాల కావ్యం రాశాడు.
మొదటి వేంకట నరసింహాచార్యులు (క్రీ.శ.1600)
రచనలు: 1. శ్రీకృష్ణ శతానందీయం
2. చిలువపడగరేని ప్రేరణం
(అచ్చ తెనుగు కావ్యం)
3. క్షత్రబందోపాఖ్యానం
4. రామానుజాభ్యుదయం
హరిభట్టు (క్రీ.శ.1550)
బిరుదు: అష్టఘంటావధాని
రచనలు: 1. వరాహ పురాణం
2. నరసింహ పురాణం (ఉత్తర భాగం)
3. మత్స్యపురాణం
4. భాగవతం పష్ట ఏకాదశ, ద్వాదశ స్కంధాలు రచించాడు
ఏకామ్రనాథుడు: ఈయన రచించిన ‘ప్రతాపరుద్ర చరిత్ర’ తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం.
నోట్‌: ప్రతాపరుద్ర చరిత్రను 18వ శతాబ్దానికి చెందిన కూసుమంచి జగ్గకవి ‘సోమదేవ రాజీయం’ పద్య కావ్యంగా రచించాడు.
కాసె సర్వప్ప (క్రీ.శ.1600)
15వ శతాబ్దానికి చెందిన ఈయన కుమ్మరి కులానికి చెందినవాడు.
రచనలు
1. నవచోళ చరిత్ర 2. మల్హణ చరిత్ర
3. శంకర దాసమయ్య చరిత్ర
4. సంగమయ్య చరిత్ర 5. శిష్య ప్రబోధం
రెడ్రెడ్డి మల్లారెడ్డి ( క్రీ.శ.1650-1700)
గంగాపురంలోని చెన్నకేశవస్వామి మహిమలను వర్ణిస్తూ గంగాపుర మహత్యం అనే స్థల పురాణం రచించాడు.
బిజ్జల తిమ్మభూపాలుడు (క్రీ.శ.1675-1725)
ఈయన అలంపూర్‌ రాజధానిగా ప్రాగటూరు ప్రాంతాన్ని పాలించాడు.
సంస్కృతంలో మురారి రచించిన ప్రసిద్ధ నాటకం ‘అనర్ఘరాఘవం’ను కావ్యంగా రచించాడు.
పెదసోమ భూపాలుడు (క్రీ.శ.1663-1712)
జయదేవుని అష్టపదులకు విపుల వ్యాఖ్యానం రాశాడు.
నోట్‌: గద్వాల కోటను నిర్మించి రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. ఇతడిని నల్లసోమనాద్రిగా వర్ణిస్తూ కవులు పాటలు పాడేవారు.
కాణాదం పెద్దన సోమయాజి (క్రీ.శ.1752-93)
ఈయన గద్వాల చినసోమభూపాలుని ఆస్థాన కవి.
అభినవ భోజుడు, అభినవ అల్లసానిగా కీర్తి పొందాడు.
రచనలు: 1. బాలకాండ తాత్పర్యం
2. ఆధ్యాత్మ రాయాయణం
3. ముకుంద విలాసం
4. మత్స్య పురణాన్ని తెలుగులోకి
అనువాదం
చినసోమ భూపాలుడు (క్రీ.శ.1762-93)
గద్వాల సంస్థాన చరిత్రలో చినసోమభూపాలుని పాలనా కాలం సాహిత్యంలో స్వర్ణయుగం.
ఈయన కవిపండిత పోషకుడేగాక స్వయంగా కవి.
హరిభట్టు రత్నశాస్ర్తాన్ని అనువదించాడు. అష్టపదులను యక్షగానంగా రాశాడు.
పరశురామ పంతుల లింగమూర్తి (క్రీ.శ.1710-1800)
వరంగల్‌ వాస్తవ్యులు
రచనలు: 1. రతీమన్మథ విలాసం
2. మానవ శతకం 3. సీతపాట
4. సీతారామాంజనేయ సంవాదం (వేదాంత గ్రంథం)

ఉర్దూ సాహిత్యం మహ్మద్‌ కులీకుతుబ్‌షా
తన ప్రేయసి భాగమతి పేరు మీద బాగ్‌నగరం (ఉద్యానవన నగరం) 1591లో నిర్మించాడు.
వజిహీ, గవాసీ, మీర్జా మహ్మద్‌ అమీన్‌ అనే ఉర్దూ కవులను పోషించాడు.
మహ్మద్‌ కులీకుతుబ్‌షా స్వయంగా కవి. ‘మాలిని’ అనే కలం పేరుతో ‘కులియాత్‌ కులీ’ అనే కవితలు రచించాడు.
ఇతని ఉర్దూ కవితల సంకలనాన్ని ‘దివాన్‌’ పేరుతో ఇతని అల్లుడు సుల్తాన్‌ మహ్మద్‌ కుతుబ్‌షా వెలువరించాడు.
ఫిరోజ్‌: ఇతను ఇబ్రహీం కుతుబ్‌షా కాలానికి చెందిన కవి.
వజిహీ: ఇతని రచనలు- కుతుబ్‌ ముస్తరీ (కవిత్వం) సుబ్రాస్‌ (వచనం)
గవాసీ: ఇతను బీజాపూర్‌కు కుతుబ్‌షా రాయబారిగా పనిచేశాడు.
రచనలు: 1. సైపుల్‌ ముల్క్‌ వ బదీ ఉల్‌-జమాల్‌
2. తోతినామా 3. మైనాసత్వంతీ
ఇబ్న్‌ నిషాతీ: క్రీ.శ.1656లో మథ్నవీపూల్‌బన్‌ రచించాడు.
హజ్రత్‌ షేక్‌ అబ్దుల్‌ ఖదీర్‌ జిలానీ, మఖ్దూమ్‌ జీషా మహ్మద్‌ ఇబ్రహీంలను గురించి కావ్యం రాశాడు.
మాలిక్‌ ఖుష్‌నూద్‌: ఇతడు అబ్దుల్లా కుతుబ్‌షా కాలానికి చెందినవాడు. ‘మార్ధియా’ కావ్యం రచించాడు. అంటే శోక కావ్యం అని అర్థం.
గులాం అలీ: అబుల్‌ హసన్‌ ఆస్థాన కవుల్లో ఒకడు. ‘జంగ్‌నామా’ రచించాడు.
అలీఖాన్‌ లతీఫ్‌: ఇతను అబ్దుల్లా, అబుల్‌ హసన్‌ కుతుబ్‌షాల దర్బారులో ఉన్న తురుష్క అమీర్‌. జఫర్‌నామా రచించాడు.
ముల్లా హసన్‌ తిబ్లిసీ: రచనలు
1. సైదియా 2. మర్ఘూబుల్‌-కులూబ్‌
మీర్జా మహమ్మద్‌ అమీన్‌ షహ్రిస్తానీ
మహమ్మద్‌ కులీకుతుబ్‌షాతో 1602-03లో మీర్‌ జుమ్లాగా నియమితులయ్యాడు.
రచనలు
1. జిలుల్లామ్‌ 2. జిల్లె ఇల్లాహ్‌
3. జిల్లీ-ఇల్లామి 4. సుల్తాన్‌
మహమ్మద్‌ హుసేన్‌ బుర్హాన్క్‌:
బుర్హానె-కాతీలను ప్రముఖ పార్శీ నిఘంటువును రూపొందించి అబ్దుల్లా కుతుబ్‌షాకు అంకితమిచ్చాడు.
ఇబ్రహీం కుతుబ్‌షా కాలంలో కుర్షాబిన్‌ కబ్బాదుల్‌ హుస్సేన్‌ ‘తారిఖ్‌ కుతుబ్‌షాహీ’ అనే గ్రంథాన్ని రచించాడు.
మీర్జా నిజాముద్దీన్‌ అహ్మద్‌ సైదీ
అబ్దుల్లా కుతుబ్‌షా మొదటి 19 సంవత్సరాల పాలనను తెలియజేస్తూ ‘హదికతుస్‌-సలాతిన్‌’ అనే గ్రంథం రాశాడు.
అలీబిన్‌ తైపూర్‌ బుస్తామీ
ఇతడు అబుల్‌ హసన్‌ కుతుబ్‌షా కాలం నాటి వాడు. హదాయికస్‌-సలాతిన్‌ (నృపతుల ఉద్యానవనం) రచించాడు.
నవీన సాహిత్యం
అసఫ్‌జాహీల యుగం
అఫ్జలుద్దౌలా తరువాత ఇతని కొడుకు మహబూబ్‌ అలీఖాన్‌ (1869-1911) కాలంలో విద్యా వ్యాప్తికి కృషి జరిగింది.
1864లో మొట్టమొదటి ఆంగ్ల పత్రిక ‘దక్కన్‌ టైమ్స్‌’ ప్రారంభమయ్యింది.
1884లో ఉర్దూను రాజభాషగా చేశారు.
1885లో దాదాపు 25 ఆంగ్ల, ఉర్దూ పత్రికలు వచ్చాయి.
1885లో విద్యావ్యాప్తి కోసం సిటీ హైస్కూల్‌, చాదర్‌ఘాట్‌ హైస్కూళ్లను స్థాపించారు.
భాగ్యరెడ్డి వర్మ హ్యుమానిటేరియన్‌ లీగ్‌ను స్థాపించి హరిజనోద్దరణకు కృషిచేశాడు.
1901లో కొమర్రాజు లక్ష్మణరావు, మునగాల రాజా నాయిని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు సుల్తాన్‌బజార్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు.
1904లో హన్మకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్రభాషా నిలయం, 1905లో సికింద్రాబాద్‌లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం స్థాపితమయ్యాయి.
మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.
1914లో పురావస్తు శాఖను ఏర్పాటు చేసి అజంతా, ఎల్లోరా, రామప్ప వంటి చారిత్రక ప్రదేశాలను సంరక్షించారు.
1921 నవంబర్‌ 12న వివేకవర్ధిని ప్రాంగణంలో మహర్షి కార్వే అధ్యక్షతన జరిగిన సంఘసంస్కరణ సభలో న్యాయవాది ఆలంపల్లి వెంకటరామారావు తన ఉపన్యాసాన్ని తెలుగులో ప్రారంభించడంతో చప్పట్లతో హేళన చేశారు.
దీన్ని అవమానంగా భావించిన తెలుగువాళ్లు టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమై ‘నిజామాంధ్ర జనసంఘం’ను స్థాపించారు. దీని స్థాపనలో మాడపాటి హన్మంతరావు, బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజ్‌ వీరభద్రరావు తదితరులు ప్రముఖపాత్ర వహించారు.
1926లో గోల్కొండ పత్రిక స్థాపితమయ్యింది.
1901లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయం స్థాపనకు పూర్వమే హైదరాబాద్‌లో 1872లో సోమసుందర్‌ మొదలియార్‌, ముదిగొండ శంకరాధ్యులు సికింద్రాబాద్‌లో రెండు గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు.
1879లో మంగమెన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ సొసైటీ వారు హైదరాబాద్‌లో ఒక గ్రంథాలయాన్ని స్థాపించారు.
1892లో అసఫియా స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, 1895లో భారత్‌ గుణవర్ధక్‌ గ్రంథాలయం శాలిబండలో స్థాపించారు.
1869లో ఆల్బర్ట్‌ రీడింగ్‌ రూం బొల్లారంలో స్థాపించారు.
1905లో ఆంధ్రసంవర్ధినీ గ్రంథాలయం, 1913లో వరంగల్‌ మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్రభాషా నిలయం స్థాపించారు.
1918లో రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయం, 1913లో కేవీ రంగారెడ్డి వేమన గ్రంథాలయం, 1923లో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం, 1926లో ఆది హిందూ లైబ్రరీ, 1930లో జోగిపేట గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా గ్రంథాలయాలు ప్రారంభమవడంతో ప్రజల్లో చైతన్యం పెరిగింది.

- Advertisement -

కంచర్ల గోపన్న (క్రీ.శ.1620-80)
జన్మస్థలం: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి
బిరుదు- రామదాసు
రఘునాథ భట్టరాచార్యుల గురుత్వంలో రామభక్తిని పెంపొందించుకున్నాడు.
అక్కన్న, మాదన్నలు ఇతని మేనమామలు
‘దాశరథీ కరుణాపయోనిధి’ భద్రగిరి దాశరథ కరుణాపయోనిధి’ మకుటంతో దాశరథీ శతకం, దాశరథీ కీర్తనలు రాశాడు.
ప్రతి ఏటా రామకోటి రాసి భద్రాచలం రామునికి అందించేవాడు.
ఆనందభైరవ రాగాన్ని మొదట ఉపయోగించిన వాగ్గేయకారుడు రామదాసు

-దేవపూజ పబ్లికేషన్స్‌ (తెలంగాణ సమాజం) సౌజన్యంతో..

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement