హైదరాబాద్, ఫిబ్రవరి 6(నమస్తే తెలంగాణ): రెండేండ్ల క్రితం చేప పిల్లలు పంపిణీ చేసిన(2023-24 కాలంలో) వారికి బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తున్న ప్రభుత్వ తీరును హైకోర్టు తప్పుపట్టింది. బిల్లులు చెల్లించాలని, లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించినా అధికారులు ఎందుకు పట్టించుకోలేదని నిలదీసింది. చేప పిల్లలు పెరిగి, పెద్దవి అవ్వడమే కాకుండా వాటిని అమ్మేసి ఆర్థికంగా సొ మ్ము చేసుకునే సమయంలో కూడా బిల్లులు చెల్లించాలని గుర్తుకురాలేదా? అని ప్రశ్నించింది. వ్యక్తిగత హాజరుకు ఉత్తర్వులు జారీచేసినా అమలు చేయకుండా గడువు కోరడంపై నిప్పులు చెరిగింది. బిల్లులు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పిం ది.
బిల్లులు చెల్లించాలని 2025లో హైకో ర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయడం లేదని శ్రీసాయి ఫిష్ సీడ్స్, ఇతరులు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలు చేయగా జస్టిస్ టీ మాధవీదేవి శుక్రవారం విచారించారు. పిటిషనర్ తరపు న్యాయవాది డీఎల్ పాండు వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాలు అమలుకాకపోవడంతో అధికారులు హాజరుకావాలని ఉత్తర్వులు వెలువడ్డాయని, బడ్జెట్ రూపకల్పనలో ఉన్నామని చెప్పి హాజరు కాకుండా మినహాయింపు కోరార ని తెలిపారు. ప్రభుత్వ న్యాయవాదులు స్పందిస్తూ రూ.8.08 కోట్లు, రూ.17.30 కోట్ల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందని, నాలుగు వారాల్లోగా టోకె న్లు జారీ అవుతాయని తెలిపారు. నాలుగు వారాల్లో చెల్లిస్తామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకో ర్టు, టోకెన్లు జారీ చేసి ఏడాదైనా బిల్లులు చెల్లించని కేసులు కూడా ఉన్నాయని వ్యా ఖ్యానించింది. నాలుగు వారాల్లో బిల్లులు చెల్లించి నివేదికను ఇవ్వాలని ఆదేశించింది. విచారణను మార్చి 6కి వాయిదా వేసింది.