TGPSC | అసిస్టెంట్ సివిల్ ఇంజనీర్ ఉద్యోగాల తుది ఫలితాలను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ఎంపికైన వారి ప్రివిజినల్ లిస్ట్‌ను వెబ్సైట్లో పొందుపరిచింది. ఈ విషయాన్ని టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ వెల్లడించారు.
TGPSC | మున్సిపల్ శాఖలో అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్, డ్రిల్లింగ్ సూపర్వైజర్ వంటి 650 ఉద్యోగాల భర్తీకి 2022 సెప్టెంబర్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి 2023 అక్టోబర్ 18, 19వ తేదీల్లో పరీక్ష నిర్వహించారు. పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసి తుది జాబితాను వెబ్సైట్లో పొందుపరిచినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.